టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రంగా విమర్శలు చేశారు.ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని తెలిపారు.
తొలిసారి వెన్నుపోటుతో రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యమా అని మూడో సారి రుణమాఫీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని సీఎం జగన్ పేర్కొన్నారు.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీయేనని విమర్శించారు.
ఈ క్రమంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయన్న సీఎం జగన్ అబద్ధాలు, మోసాలను నమ్మొద్దని సూచించారు.తోడేళ్లు మొత్తం ఏకమై వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో మీ బిడ్డకు పొత్తు మీతోనే అని మరోసారి స్పష్టం చేశారు.







