కోచింగ్ లేకుండా సివిల్స్ కొట్టిన తెలంగాణ కుర్రాడు.. సంకేత్ కుమార్ సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

కోచింగ్ లేకుండా సివిల్స్( Civils ) సాధించడం కష్టమని చాలామంది భావిస్తారు.అయితే ఒక యువకుడు మాత్రం కోచింగ్ లేకుండానే సివిల్స్ లక్ష్యాన్ని సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు.

 Upsc Ranker Sanketh Kumar Success Story Details, Sanketh Kumar, Ajmera Sanketh K-TeluguStop.com

గిరిజన ఆణిముత్యం అజ్మీరా సంకేత్ కుమార్( Ajmera Sanketh Kumar ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన సంకేత్ తల్లి సవిత ఇస్రోలో పని చేస్తున్నారు.

తండ్రి హార్టికల్చర్ డిపార్టుమెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.2011 సంవత్సరంలో భాష్యం పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసిన సంకేత్ 2013లో ఇంటర్, 2017లో ఐఐటీ ఢిల్లీ( IIT Delhi ) నుంచి బీటెక్ పూర్తి చేశారు.నా జాబ్ ద్వారా గిరిజన తండాల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు.అమ్మానాన్నలా ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడ్డానని సంకేత్ కుమార్ కామెంట్లు చేశారు.

Telugu Ajmerasanketh, Civils, Civils Ranker, Mancherial, Sanketh Kumar, Upsc-Ins

అమ్మానాన్నల కళ్లలో చూసిన ఆనందమే నా సక్సెస్ కు ప్రతీక అని సంకేత్ ( Sanketh ) చెబుతున్నారు.నాకు మొదటినుంచి సివిల్స్ లో సక్సెస్ సాధిస్తానని నమ్మకం ఉందని ఆ నమ్మకమే నిజమైందని సంకేత్ చెప్పుకొచ్చారు. తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుదిరిగానని సంకేత్ కామెంట్లు చేశారు.తొలిసారి జరిగిన పొరపాట్లను ఒకటికి పదిసార్లు సరిదిద్దుకున్నానని సంకేత్ చెప్పుకొచ్చారు.

Telugu Ajmerasanketh, Civils, Civils Ranker, Mancherial, Sanketh Kumar, Upsc-Ins

రెండోసారి ఎలాగైనా సక్సెస్( Success ) సాధించాలని భావించానని సివిల్స్ లో జాతీయ స్థాయిలో 35వ ర్యాంక్ సాధించానని సంకేత్ అన్నారు.సివిల్స్ లో సంకేత్ మంచి ర్యాంక్ సాధించడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.సంకేత్ కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకుంటారేమో చూడాలి.సంకేత్ కుమార్ తన సక్సెస్ స్టోరీతో ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు.కష్టపడితే కోచింగ్ లేకుండా కూడా సక్సెస్ దక్కుతుందని ప్రూవ్ చేస్తున్నారు.సంకేత్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube