టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ముగియగా సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించనున్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.ఇందులో చంద్రబాబు హెల్త్ రిపోర్టు కీలకం కానుంది.
కాగా ఇప్పటికే చంద్రబాబు హెల్త్ రిపోర్టును ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.