మెగా డాటర్ నిహారిక( Niharika ) ప్రస్తుతం ఫ్రీ బర్డ్ అయ్యారనే విషయం మనకు తెలిసిందే.ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ సరైన విధంగా సక్సెస్ కాకపోవడంతో తన కుటుంబ సభ్యులు తనకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు.
అయితే ఈమె వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగలేక తన భర్తకు విడాకులు ఇచ్చేసి తిరిగి తనకు ఎంతో ఇష్టమైనటువంటి సినిమా రంగంలోకి వచ్చారు.ఇలా విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక తిరిగి పలు వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి నిర్మాతగా కూడా మారారు.
ఇప్పటివరకు తన ప్రొడక్షన్ హౌస్ లో ఈమె కేవలం వెబ్ సిరీస్ లో మాత్రమే చేశారు.తాజాగా ఒక సినిమాకి కూడా కమిట్ అయ్యారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఆ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిహారిక ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించబోతుంది.
ఇక నిహారిక ఇండస్ట్రీలో ఎంతో మంచి స్నేహితులు ఉన్నారనే సంగతి తెలిసిందే.ఈమె గ్యాంగ్ లో నికిల్ విజయేంద్ర సింహ( Nikhil Vijayendra Simha )వితికా షేర్( Vithika Sheru ), మహా తల్లి జాను ( Mahathalli janu )వంటి వారంతా కూడా ఒక బ్యాచ్ అనే సంగతి మనకు తెలిసిందే వీరంతా ఎక్కడికెళ్లిన పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉంటారు.

ఇకపోతే సోషల్ మీడియాలో కూడా వీరంతా కలిసి చేసే రీల్స్ హంగామా మామూలుగా ఉండదని చెప్పాలి.ఈ క్రమంలోనే వీరందరూ కలిసి తాజాగా లైట్స్ ఆన్ ఆఫ్ అంటూ లైట్ ఆన్ అయినప్పుడు ఒక విధంగా ఆఫ్ అయినప్పుడు మరొక విధంగా డాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఒక రీల్ వీడియోని షేర్ చేశారు.ఇక ఈ వీడియోని నిహారిక లైట్ ఆన్ ఆఫ్ అంటూ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో పై ఎంతో మంది నేటిజన్స్ కామెంట్ చేస్తూ వీరిపై విమర్శలు కురిపించారు.

ఈ సందర్భంగా ఈ వీడియో పై స్పందించినటువంటి కొందరు అదేంటిరా మీకంటూ సొంత రీల్స్ ఏవి ఉండవా మూడో క్లాస్ పిల్లోడు చేసిన రీల్స్ కూడా మీరు చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేయక మరికొందరు మాత్రం లైట్స్ ఆఫ్ చేస్తే వీరిలో మరొక ప్రభుదేవా లారెన్స్ బయటకు వస్తున్నారు అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఒక నెటిజన్ అయితే ఏకంగా తొట్టి గ్యాంగ్ అంటారు కదా అది మీరే ప్రతిరోజు మాకు ఈ టార్చర్ ఏంది అంటూ ఈ వీడియో పై కామెంట్ చేశారు.ఇక నిహారిక బ్యాచ్ ఎక్కడికి వెళ్ళినా నిఖిల్ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన గురించి మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ.ఇండస్ట్రీ మొత్తానికి వీడే కావాలంటున్నారు.అంత ఏముంది రా బాబు వరుసగా ఒక్కొక్కరి కాపురాలు చెడగొడుతున్నావ్ అంటూ నిఖిల్ విజయేంద్ర సింహ గురించి చేసినటువంటి కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.







