తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది.
వీరిలో పురుష ఓటర్లు 1,63,13,268 మంది ఉండగా 1,63,02,261 మంది మహిళా ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది.అదేవిధంగా 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9,99,667 మంది ఉన్నారు.
తెలంగాణలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4,40,371 మంది ఉన్నారని ఈసీ అధికారులు తెలిపారు.కాగా హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు.
రెండో స్థానంలో 35,22,420 మంది ఓటర్లతో రంగారెడ్డి జిల్లా, 28,19,292 మంది ఓటర్లతో మూడవ స్థానంలో మేడ్చల్ జిల్లా ఉంది.అలాగే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.6,99,239 మంది ఓటర్లతో రెండో స్థానంలో కుత్బుల్లాపూర్ నిలవగా భద్రాచలంలో అతి తక్కువగా 1,48,713 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ ప్రకటించింది.