తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకొని వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే హరీష్ శంకర్( Harish Shankar ) కూడా తను చేసిన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు గా ప్రతి సినిమా ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఆయన చేసిన సినిమాలు తక్కువ అయిన కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ ముందుకెళ్తు ఉంటాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కొద్దిరోజులు షూటింగ్ జరిగితే మరి కొద్ది రోజులు రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది.కాబట్టి ఇలాంటి ఖాళీ సమయంలోనే హరీష్ శంకర్ పలు ఈవెంట్ లకి హాజరవుతుంటాడు.అదే విధంగా రీసెంట్ గా స్పార్క్ లైఫ్( Spark Life ) ప్రి రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న హరీష్ శంకర్ మాట్లాడుతూ ఆ టీం కి బెస్ట్ విషెస్ చెప్తూనే నా మీద కొంత మంది కొన్ని డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.
వీడు ప్రతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతున్నాడు అంత ఖాళీగా ఉన్నావేంటి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో నా మీద కామెంట్స్ చేస్తున్నారు.
అయితే నేను ముఖ్యంగా ప్రీ ఈవెంట్లకు హాజరయ్యేది ఎందుకు అంటే నా సీనియర్ డైరెక్టర్లు అయిన పూరి జగన్నాథ్ ,( Puri Jagannadh ) వినాయక్( Vinayak ) లాంటివారు నన్ను కూడా అదే రీతిలో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను కూడా ఇంకో నలుగురు కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమా టీమ్ మొత్తానికి బుస్టాప్ ఇస్తున్నాను అంటూ సమాధానం ఇవ్వడం జరిగింది.ఇక స్పార్క్ లైఫ్ సినిమా గురించి మాట్లాడుతూ హీరో విక్రాంత్, మెహరీన్, సుహాసిని గారు తప్ప నాకు ఇక్కడ ఎవరూ తెలియదు అని హరీష్ శంకర్ మాట్లాడుతూనే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టెక్నీషియన్స్ అందరూ మంచి గుర్తింపు పొందుతారు అంటూ మాట్లాడడం జరిగింది…
.