వైసీపీ మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు విచారణ వాయిదా పడింది.ఈ మేరకు టీడీపీ నేత బండారు సత్యనారాయణ అరెస్టుపై దాఖలైన హెబియస్ కార్బస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పిటిషన్ విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ సమర్పించేందుకు పోలీసుల తరపు న్యాయవాది కోర్టును కోరారు.దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
అయితే మంత్రి రోజాను ఉద్దేశించి టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.మంత్రి రోజాను దూషించారని వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.







