తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.24 గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు కేసీఆర్ నిరూపించాలని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.ఒకవేళ కరెంట్ ఇస్తున్నట్లు ఆయన నిరూపిస్తే కొడంగల్, కామారెడ్డిలో తన నామినేషన్లను ఉపసంహరించుకుంటానని తెలిపారు.
ఈ క్రమంలో లాగ్ బుక్ లు తీసుకుని కేసీఆర్ కామారెడ్డికి రావాలని ఛాలెంజ్ విసిరారు.