తెలంగాణలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది.రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు 4,798 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.
అయితే వీరిలో అసంతృప్తిగా ఉన్న 608 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించారు.ఈ క్రమంలో నామినేషన్ల పరిశీలన పూర్తయిన తరువాత ఎన్నికల బరిలో 4,190 మంది అభ్యర్థులు నిలిచారు.
అయితే తిరస్కరణకు గురైన నామినేషన్లలో హుజురాబాద్ లో ఈటల జమున నామినేషన్, నాగార్జునసాగర్ లో జానారెడ్డి డమ్మీ నామినేషన్ ఉన్నాయి.వాటితో పాటు బీఎస్పీకి చెందిన ఎనిమిది మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.
కాగా నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉంది.







