గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్నా(Rashmika Mandanna) గురించి గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే వీరిద్దరిపై ఎన్నోసార్లు ప్రేమ వార్తలు వినిపించినప్పటికీ అలాంటిదేమీ లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆ వార్తలు తోసిపుచ్చుతూ వస్తున్నారు.
అయితే ఇప్పటికే ఎన్నోసార్లు ఈ జంట మీడియాకి, నెటిజన్స్ కి అడ్డంగా బుక్ అయ్యారు.అంతేకాకుండా ఓసారి ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కి వెళ్లిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అలాగే మాల్దీవ్స్ వెకేషన్స్ కి వెళ్ళిన ఫోటోలు, రష్మిక బర్త్ డే రోజు(Rashmika Birthday) ఆమె మాట్లాడే ఒక వీడియోలో విజయ్ దేవరకొండ వాయిస్ ఇలా ఎన్నోసార్లు వీరిద్దరూ కలిసే ఉంటున్నారని నెటిజన్స్ పసిగట్టారు.
అయితే తాజాగా దీపావళి పండుగ( Diwali Festival ) సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి పండగలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు.ఇక వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అనేకం చక్కర్లు కొడుతున్నాయి.అయితే రష్మిక మందన్నా కూడా పద్ధతిగా పట్టు చీర కట్టుకొని ఉన్న ఒక ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
కానీ రష్మిక మందన్న షేర్ చేసిన ఫోటోలో ఉన్న ఒక క్లూ ఆధారంగా రష్మిక రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అంటూ వస్తున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యామిలీతోనే హీరోయిన్ రష్మిక దీపావళి పండుగ సంబరాలు జరుపుకుందని అందరూ భావిస్తున్నారు.
ఎందుకంటే విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి ఇంటి ముందు పటాసులు కాల్చుతూ దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే ఆ ఫోటోలో వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ గోడ మీద ఉన్న డిజైన్ అచ్చం రష్మిక షేర్ చేసిన ఫోటో వెనుక ఉన్న గోడ డిజైన్ సేమ్ టు సేమ్ ఉన్నాయి.ఇక ఈ ఒక్క క్లూ తో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఇద్దరు ఒకే దగ్గర దీపావళి పండుగలు జరుపుకున్నారని అందరూ భావిస్తున్నారు.
ఇలా ఎన్నోసార్లు మీడియాకి అడ్డంగా బుక్కైనా రష్మిక విజయ్ దేవరకొండ మాత్రం వారి మధ్య ఉన్న లవ్వుని బయట పెట్టడం లేదు.ఇక ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటానని కూడా క్లారిటీ ఇచ్చారు.
మరి చూడాలి విజయ్ దేవరకొండ చేసుకోబోయేది రష్మిక మందన్ననేనా లేక మరెవరినైనా చేసుకుంటారా అనేది చూడాలి.