రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈ నెల 30 వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)కు ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు, తపాల కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(ఆర్టీఐ),
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఎఐ) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ గుర్తింపు కార్డు (యూడీఐడీ)లు కలిగి ఉండాలనీ జిల్లా కలెక్టర్ చెప్పారు.ఈ 12 కార్డులో ఏ గుర్తింపు కార్డు ఉన్న ఓటు వేయవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు.