తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )లో చాలామంది రచయితలు దర్శకులుగా మారుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు.
ఇలాంటి క్రమంలోనే మరి కొంతమంది రచయితలు దర్శకులుగా మారే అవకాశాలు ఉన్నాయి.అందులో సాయి మాధవ బుర్ర ఒకరు ప్రస్తుతం ఈయన తెలుగులో టాప్ మోస్ట్ డైలాగ్ రైటర్ గా కొనసాగుతున్నారు ఇక ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈయన తొందర్లోనే మెగా ఫోన్ పడుతున్నారని అందుకు తగ్గ కథ కూడా రెఢీ చేసుకున్నారనే వార్త నెట్లో తెగ హల్ చల్ చేస్తుంది…
ఇక ఇప్పటికే ఈయన( Sai Madhava Burra ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకి కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.అది కూడా పిరియాడికల్ మూవీ చెయాబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.ఇక ఇప్పటికే చాలా మంది రైటర్లు,దర్శకులుగా వాళ్ల లక్కు పరీక్షించుకుంటున్నారు ఇక ఇలాంటి క్రమంలో ఈయన కూడా దర్శకుడుగా మారితే ఇండస్ట్రీలో రైటర్లు తగ్గిపోతున్నారనే చెప్పాలి.
అయితే ఈయన దర్శకుడుగా ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపిస్తాడు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.ఇక రైటర్ గా ఇప్పటికే ఆయన చాలా సక్సెస్ ఫుల్ రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు.
అయినప్పటికీ దర్శకుడి గా ఆయన మాత్రం ఏ మేరకు సత్తా చాటుతాడు అనేది తెలియాల్సి ఉంది.
ఈ క్రమంలో ఈయనతో చేసే స్టార్ హీరో ఎవరు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి అని తెలుస్తుంది…ఇక ఈయన మొదటి సినిమా తో సక్సెస్ కొడితే ఈయన ఇండస్ట్రీ లో పెద్ద డైరెక్టర్ గా పేరు సంపాదించు కుంటాడు… అయితే రైటర్ గా టాప్ రేంజ్ లో దూసుకుపోయిన ఈయన మరి డైరెక్టర్ గా( Director ) సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి…