పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి శ్రీ లీల( Sreeleela ) .రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
అయితే మొదటి సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ అందులో శ్రీ లీల నటన అందంతో ప్రేక్షకులను మెప్పించారు.దీంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇలా తెలుగులో వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి ఈమె అనంతరం ధమాకా( Dhamaka ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యారు.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల నుంచి మొదలుకొని సీనియర్ స్టార్ హీరోల వరకు కూడా శ్రీ లీల ఆప్షన్ గా మారిపోయారు.
తాజాగా ఈమె బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో బాలయ్యకు కూతురు పాత్రలో శ్రీ లీల నటించారు.ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావటం విశేషం.ఎంతో మంచి సక్సెస్ కావడంతో శ్రీ లీల క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి.ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఒకవైపు వరుసగా విడుదలకు సిద్ధమవుతూ ఉండగా మరికొన్ని సినిమా షూటింగ్ పనులలో ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.
నవంబర్ 24వ తేదీ శ్రీ లీల మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ( Adi Kesava ) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో శ్రీ లీలా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కూడా ఈమె అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.
తాజాగా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేసినటువంటి ఈమె ఆస్క్ మీ అంటూ నేటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకు వచ్చారు.
ఈ సందర్భంగా నేటిజన్స్ వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ ఈమె నుంచి సమాధానాలు రాబట్టారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.ప్రస్తుత కాలంలో సినిమాలలో అవకాశాలు రావాలి అంటే హీరోయిన్స్ ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సంఘటనలను మనం చూస్తున్నాము.
ఇలా కెరియర్ మొదట్లో చాలామంది కమిట్మెంట్స్ అడిగారు అంటూ ఎంతో మంది సెలబ్రిటీలు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలిపారు.ఈ క్రమంలోనే శ్రీ లీల కూడా ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా అంటూ నేటిజన్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ అవును తాను కమిట్మెంట్( Commitment ) ఇచ్చాను అని అయితే తన పనికి తాను కమిట్మెంట్ ఇచ్చాను అంటూ శ్రీ లీల సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది.ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల తన వర్క్ కి తాను కమిట్మెంట్ ఇచ్చాను అంటూ సమాధానం చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు గుంటూరు కారం( Guntur Karam ) సినిమాలో నటిస్తున్నారు.అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
నితిన్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోల సినిమాలలో కూడా ఈమె నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.