సాయి ధన్సిక సైకో థ్రిల్లర్ 'దక్షిణ' నుండి గ్లిమ్స్ విడుదల !!!

హీరోయిన్ ఓరియెంటెడ్ నేపథ్యంగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఓషో తులసీరామ్( Osho Tulasiram ) దర్శకత్వం వహిస్తున్నారు.గతంలో ఛార్మీ కౌర్ హీరోయిన్‌గా మంత్ర, మంగళ చిత్రాలకు ఓషో తులసిరామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

 Sai Dhansika Dakshina Movie Glimpse Released Details, Sai Dhansika, Dakshina Mov-TeluguStop.com

కల్ట్ కాన్సెప్ట్ బ్యానర్‌పై నిర్మాత అశోక్ షిండే దక్షిణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇటీవల మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.

భారీ స్పందన లభించింది.తాజాగా చిత్ర యూనిట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు.

సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కాంబినేషన్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది, సాయి ధన్సిక( Sai Dhansika ) పేరు చెబితే కబాలి మూవీ గుర్తుకు వస్తుంది.ఈ సినిమా తర్వాత ఆమెను ‘దక్షిణ’ ( Dakshina Movie ) ఫేమ్ ధన్సిక అంటారు.

ఆవిడ రోల్ అంత పవర్ ఫుల్ గా ఉంటుందని నిర్మాత అశోక్ షిండే అన్నారు.

హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్‌తో సాయి ధన్సిక ప్రేక్షకులను ఈ సినిమాలో మెప్పిస్తుంది.

ఈ చిత్రంలో బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్ రోల్ చేస్తున్నారు.ఇదొక సైకో థ్రిల్లర్.

తెలుగు, తమిళ భాషల్లో త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube