సీనియర్ సినీ నటుడు చంద్రమోహన్( Chandra Mohan ) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు ఉదయం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా చంద్రమోహన్ మరణించారనే వార్త తెలియడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించినటువంటి చంద్రమోహన్ లేరని లోటు ఇండస్ట్రీకి తీరనిదని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈయన మరణ వార్త స్పందిస్తూ ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఇలా చంద్రమోహన్ మరణించడంతో గత ఇంటర్వ్యూలలో భాగంగా సినీ సెలబ్రిటీల గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక చిరంజీవి( Chiranjeevi ) చంద్రమోహన్ కలిసి ప్రాణం ఖరీదు తాయారమ్మ బంగారయ్య( Tayaramma Bangarayya) వంటి సినిమాలలో కూడా నటించారు.అయితే ఒక ఇంటర్వ్యూలో ఈయన చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాలో చేసే సమయంలో తన రెమ్యూనరేషన్ ( Remuneration) 5000 అని తెలియజేశారు.అప్పటికి తాను చాలా సీనియర్ నటుడని చంద్రమోహన్ తెలిపారు.

చిరంజీవి రెమ్యూనరేషన్ 5వేలు అయితే నాకు 25వేల రూపాయలు ఇచ్చేవారని తనకన్నా నాకు ఐదు రెట్ల రెమ్యూనరేషన్ అధికంగా ఇచ్చేవారు అంటూ చంద్రమోహన్ ఒక సందర్భంలో తెలియజేశారు.చిరంజీవి గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ ఆయన చాలా సిన్సియర్ గా ఉండేవారని ఒక మంచి నటుడు కావాలనే తపన తనలో కనిపించేదని తెలిపారు.అప్పట్లో ఏఎన్ఆర్ తర్వాత అద్భుతంగా డాన్స్ చేసేవాడిని నేనే కానీ చిరంజీవి వచ్చిన తర్వాత తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని అద్భుతమైనటువంటి నటనతో పాటు డాన్సులు కూడా చేసి అందరిని మెప్పించేవారు అంటూ చిరంజీవి గురించి ఒకానొక సందర్భంలో చంద్రమోహన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
.






