రాజన్న సిరిసిల్లలో అభివృద్ధి చేశాడని కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడని ఒక వాన చినుకుకే సిరిసిల్ల మొత్తం నీట ముంచుతున్నాడని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాడు.సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ప్రజా ఆశీర్వాద ర్యాలీ లో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.
హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకొని రగుడు పాత బస్టాండ్ నుండి చేనేత విగ్రహ చౌరస్తా వరకు కొనసాగిన భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ….
ఒకవైపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ 50 లక్షల సొమ్ముతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి నాపై పోటీ చేస్తాడా అని కేసీఆర్ అంటున్నడని, మరోవైపు ఎంపీ టిక్కెట్లు అమ్ముకున్న సన్నాసి కేసీఆర్ నాపై పోటీ చేస్తాడా అని రేవంత్ రెడ్డి అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పద్ధతిని చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ సీఎం అభ్యర్థులు ఎంత అవినీతిపరులో అర్థమౌతుందన్నారు.
అదే బీజేపీకి అవకాశమిస్తే ఏ అవినీతి ఆరోపణల్లేని పేద నాయకుడు సీఎం అవుతారని తెలిపారు.
కేటీఆర్ సిరిసిల్లను అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నడని, ఒక్క వాన చినుకుకే సిరిసిల్ల మొత్తం నీటిలో మునిగిపోతుందన్నారు.సిరిసిల్ల కొత్తచెరువు ఆధునీకరణ పేరిట సగం వరకు పూడ్చి వేసి శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, సంజీవయ్య నగర్, అనంత్ నగర్ సర్దార్ నగర్ లను వరదలో ముంచుతున్నడని మండిపడ్డారు.
బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాలను ఆగం చేశాడని,నేతనాల కడుపు కొట్టాడన్నారు.కేవలం పదిమంది ఆసాములు మాత్రమే బతుకమ్మ చీరలతో లబ్ధి పొందుతున్నారన్నారు.కేసీఆర్ పాలనలో కొడుకు సీఎం అయితే ఇక్కడ సామంత రాజుల పాలన సాగుతోందని, మండలానికి ఇద్దరు ముగ్గురు సామంత రాజులు నియోజకవర్గాన్ని దోచుకుంటారని అన్నారు.
కొంతమంది పోలీసులు బిజెపి కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతూ బీజేపీ నాయకులపై దాడులు చేస్తూ కేసులు పెడుతుంటే, సిరిసిల్లకు వచ్చి ఇక్కడే కూర్చుంటానని తెలిపారు.
సెస్ ఎన్నికల్లో కేటీఆర్ కు బీజేపీ దమ్ము చూపిన కార్యకర్తలను అభినందించారు. బీజేపీ పార్టీ ప్రజల్లో గుండెల్లో ఉందన్నారు.కల్వకుంట్ల కుటుంబం సిరిసిల్లకు రావాలంటే బందోబస్తు కావాలన్నారు.బిజెపి పార్టీపోలీసులకు వ్యతిరేకం కాదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటూ, రాక్షస పాలన కొనసాగిస్తోందని, తెలంగాణ ప్రజలకు విముక్తి చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం తనను ఆదేశించిందన్నారు.అందుకే 50 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన యుద్దం చేసి, జైలుకు వెళ్లానని రైతుల పక్షాన ఉద్యమించి లాఠీదెబ్బలు తిన్నానన్నారు.
జీతాలు నష్టపోయిన ఉద్యోగుల పక్షాన యుద్దం చేసి జైలుకు వెళ్లానని, రైతుల పక్షాన కొట్లాడాను అని గుర్తుచేశారు.
కేటీఆర్ నువ్వే సీఎం అనుకుంటున్నవ్ కదా… నీకు దమ్ముంటే మీ అయ్య నిన్ను సీఎంగా ప్రకటించమనమని సవాలు విసిరారు.
సిరిసిల్లలో ఎంత మందికి ఉద్యోగాలు, ఎంత మందికి నిరుద్యోగ భ్రుతి, ఎంత మంది లక్ష రూపాయల రుణమాఫీ, చేశావో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాలు విసిరారు.కేటీఆర్ సిరిసిల్లాకు చేసిందేమీ లేదని, సీఎం కొడుకువి కాకుంటే నిన్ను కుక్కలు కూడా దేఖవని ఎద్దేవా చేశారు.
బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని, కులం కంటే గుణం ముఖ్యమని కేసీఆర్ అంటూ కులాలను అవమానిస్తున్నడన్నారు.బీసీ సీఎం అయితే పేద, బడుగు, బలహీనవర్గాల జీవితాల బాగుపడుతాయని చెప్పారు.
సిరిసిల్లలో రాణిరుద్రమను చూస్తే కేటీఆర్ కు వణుకు పుడుతోందని, ఈసారి ఆమె గెలుపు ఖాయమని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.కేటీఆర్ అహంకారంతో మోదిని అనుచిత వాక్యాలు చేస్తున్నారన్నారు.
కెసిఆర్ నెంబర్1 చోరీ అయితే కేటీఆర్ 10 నెంబర్ అని అన్నారు.ఎంపీ ఎలక్షన్లో కేవలం బి ఆర్ ఎస్ ఐదు ఓట్లతో గెలిచారని తెలిపారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, ఆమెను సిరిసిల్ల ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.బండి సంజయ్ సిరిసిల్లకు రావడంతో నాయకుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.