తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.మైనారిటీలను బీసీల్లో చేర్చుతామనడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
మైనార్టీలకు కుల గణన అవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ డిక్లరేషన్ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందన్న కేటీఆర్ ముస్లింలకు, బడుగు వర్గాలకు మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని ఆరోపించారు.







