కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ పై కేటీఆర్ విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.

మైనారిటీలను బీసీల్లో చేర్చుతామనడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.మైనార్టీలకు కుల గణన అవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ డిక్లరేషన్ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందన్న కేటీఆర్ ముస్లింలకు, బడుగు వర్గాలకు మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని ఆరోపించారు.