తెలుగు సినిమా ఇండస్ట్రీ అంకిత మంచి గుర్తింపు పొంది చాలా రోజులపాటు ఇండస్ట్రీ కొనసాగింది.అయినప్పటికీ ఆ తర్వాత ఒక బిగ్గెస్ట్ పొరపాటు వల్ల ఆమె కెరియర్ దెబ్బతిన్నదనే చెప్పాలి… లాహిరి లాహిరి లాహిరి లో ( Lahiri Lahiri Lahiri )లాంటి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అంకిత ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పక్కన సింహాద్రి సినిమాలో నటించింది.
ఇక ఆ సినిమా సక్సెస్ అవడంతో ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు వచ్చాయి.ఇక బాలకృష్ణ లాంటి స్టార్ హీరో పక్కన కూడా విజయేంద్ర వర్మ( Vijayendra Verma ) అనే సినిమాలో నటించి తన కంటు ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచు కుంది.ఇక ఇలాంటి క్రమంలో ఆమె చేసిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి.ఒకరకంగా ఇండస్ట్రీలో ఆమె కెరియర్ అనేది ఎదుగుతున్న క్రమంలో ఆమె కెరియర్ ని ఆమెనే నాశనం చేసుకుంది.
ఎందుకంటే తను స్టోరీస్ సెలక్షన్స్ లో శ్రద్ధ తీసుకోకుండా ఏది పడితే ఆ సినిమా చేయడం వల్ల ఆమెకి సక్సెస్ అనేది కనుమరుగైపోయింది.
ఇక ముఖ్యంగా రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ తో ఎన్టీయార్ లాంటి స్టార్ హీరో తో సింహాద్రి సినిమాలో చేసిన తర్వాత ఆమె తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు.దాంతో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది.ఆమె అలా వెళ్ళిపోవడానికి రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) లాంటి వాళ్ళు కూడా కారణమనే చెప్పాలి… ఎందుకంటే అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో ఆమెకి సక్సెస్ అనేది పడలేదు.
కాబట్టి ప్రేక్షకుల్లో ఆమె మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి తగ్గుతూ రావడంతో ఆమెకి ఇండస్ట్రీ లో అవకాశాలు రాలేదు… ఇక ప్రస్తుతం ఆమె మంచి క్యారెక్టర్ దొరికితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది…
.