రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్న ఘర్షణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.నిన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగడంతో పరస్పర దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో మొత్తం ఐదుగురు కాంగ్రెస్ నేతలతో పాటు, ముగ్గురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో ఇబ్రహీంపట్నంలో ఈ వివాదం చెలరేగింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహించడంతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి పార్టీ శ్రేణులను చెదరగొట్టారు.
మరోసారి ఇలాంటి ఘర్షణ చెలరేగకుండా ఇబ్రహీంపట్నంలో పోలీసులు భారీగా మోహరించారు.







