నల్లగొండ జిల్లా: ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా టిక్కెట్ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని పార్టీ కార్యకర్తలు,సామాన్య ప్రజలు కలవకుండా ముఖ్య అనుచరులు ఓ కోటరీగా ఏర్పడి ఇబ్బందులు పెడుతున్నారని సాధారణ కార్యకర్తలు, ప్రజలు వాపోతున్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది.
ఓ కోటరీగా ఏర్పడి ఆయన దర్శనం లేకుండా చేస్తున్న ప్రధాన అనుచరుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆయనతో కలిసి మాట్లాడుదామంటే అవకాశం ఇస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మండలంలో 15-20 మంది ఎప్పుడు ఆయన వెంటే ఉంటూ మిగిలిన వారిని కనీసం కలిసే అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి క్షేత్ర స్థాయిలో కార్యకర్తల,ప్రజల ఏమనుకుంటున్నారో తెలుసుకొని,తన ముఖ్య అనుచరులతో పాటు నిత్యం పార్టీ కోసం పరితపించే కార్యకర్తలను గుర్తించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవాలని కోరుతున్నారు.
లేదంటే గత అనుభవాలే పునరావృతం అవుతాయని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.మరి కార్యకర్తల మనోగతం రాజ్ గోపాల్ రెడ్డికి తెలిసినా? వారి ఆలోచనలకు దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తారా? లేదా కోటరీనే నమ్ముకుంటారా? వేచి చూడాలి మరి…!!
.