యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం( Ramannapeta ) ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం)లో 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడినదారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రపాలనగరం గ్రామానికిచెందిన కంబాలపల్లి మల్లేష్ (19) తండ్రి లింగస్వామిపై చేయని నేరానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అండతో గ్రామ బీఆర్ఎస్ పార్టీ( BRS party ) నాయకులు అక్రమ కేసు పెట్టగా,పోలీసులు కొట్టి బలవంతంగా నేరాన్ని ఒప్పించి జైలుకు పంపడంతో బెయిల్ పై బయటికి వచ్చిన మల్లేష్ మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దీనితో మల్లేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు,గ్రామ ప్రజలు రోడ్ పైకి వచ్చి ధర్నాకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.మల్లేష్ చావుకి కారణమైన ప్రతీ ఒక్కరిపై కేసు పెట్టి శిక్ష పడేలా చేయాలని,వారి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.







