Anushka Shetty : అనుష్కకు మరీ అంత హెడ్ వెయిటా… మూడుసార్లు ఆ హీరోతో అవకాశం వచ్చిన రిజెక్ట్ చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనుష్క శెట్టి ( Anushka Shetty ) ఒకరు.సూపర్ సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు.

 Anushka Rejected The Star Hero Movie That Was Offered Three Times This Is The R-TeluguStop.com

ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనుష్క తదుపరి వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఇండస్ట్రీలో ఉన్నారు.కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటిస్తూ ఈమె ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలిగారు.

అనుష్క కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రయోగాత్మక సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించారు.

Telugu Anushka, Arundhati, Baahubali, Magadheera, Prabhas, Ram Charan Tej, Rejec

ఇలా ఈమె వరుస సినిమాలలో నటిస్తూ బాహుబలి సినిమా( Baahubali ) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్నటువంటి అనుష్క ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించిందని చెప్పాలి.ఇక ఈమె ఇండస్ట్రీలో అందరి హీరోల సినిమాలలో కనిపించారు.

కానీ మెగా హీరో సినిమాలో మాత్రం ఈమె కనిపించలేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) సరసన అనుష్క ఇప్పటివరకు ఒక సినిమాలో కూడా నటించలేదు.

రామ్ చరణ్ నటించిన మూడు సినిమాలలో అనుష్కకు దర్శక నిర్మాతలు అవకాశం కల్పించారట కానీ ఈమె మాత్రం ఎప్పటికప్పుడు రామ్ చరణ్ సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చారు ఇలా మూడుసార్లు ఈమె రామ్ చరణ్ సినిమాలు రావడం కష్టమేనని అభిమానులు కూడా భావించారు.

ఈ విధంగా తమ అభిమాన హీరో సినిమాలను రిజెక్ట్ చేశారని విషయం తెలియడంతో మెగా అభిమానులు అనుష్కకు మరి అంత హెడ్ వెయిటా రాంచరణ్ సినిమాలోని రిజెక్ట్ చేశారా అంటూ ఈమె పట్ల కామెంట్ చేస్తున్నారు.

Telugu Anushka, Arundhati, Baahubali, Magadheera, Prabhas, Ram Charan Tej, Rejec

అరుంధతి సినిమా( Arundhati ) తర్వాత అనుష్కకు రాజమౌళి మగధీర సినిమాలో రామ్ చరణ్ ( Ramcharan ) సరసన నటించే అవకాశం కల్పించారట.అయితే అనుష్క తన వ్యక్తిగత కారణాలవల్ల మగధీర సినిమాలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేశారు అనంతరం సినిమాలో కూడా తనకు రామ్ చరణ్ పక్కన నటించే అవకాశం వచ్చింది అయితే కథ మొత్తం విన్నటువంటి అనుష్క ఈ సినిమా కథ నచ్చకపోవడంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేశారు ఇక చివరిగా కృష్ణవంశీ రాంచరణ్ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడే సినిమా( Govindudu Andarivadele )లో కూడా ఈమెకు అవకాశం కల్పించారట.ఇక ఈ సినిమా సమయంలో అనుష్క ఇతర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Telugu Anushka, Arundhati, Baahubali, Magadheera, Prabhas, Ram Charan Tej, Rejec

ఇలా ముచ్చటగా మూడోసారి రామ్ చరణ్ సరసన నటించే అవకాశాన్ని కూడా ఈమె కోల్పోయారు.ఇలా కొన్ని కారణాలవల్ల ఈమెకు రాంచరణ్ సరసన నటించే అవకాశాలు కుదరడం లేదు దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ హీరోలు అందరితో కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube