భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ దాదాపుగా చివరి దశకు చేరుకుంది.భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధించాయి.
ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్ జట్లు సెమీ ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించాయి.

ఇక సెమీఫైనల్ కు చేరే నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ( New Zealand , Pakistan )జట్ల మధ్య పోటీ నెలకొంది.ఈ మూడు జట్లు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో గెలిచి ఎనిమిది పాయింట్లతో రన్ రేట్ పరంగా వివిధ స్థానాల్లో ఉన్నాయి.ఈ మూడు జట్లు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఆ మ్యాచ్లో సాధారణ గెలుపు కాకుండా కాస్త అధిక రన్ రేట్ తో గెలిస్తేనే సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది.

నేడు బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది.ఈ మ్యాచ్ న్యూజిలాండ్ కు ఎంతో కీలకం.శ్రీలంక జట్టు ఇప్పటికే సెమీఫైనల్ నుంచి నిష్క్రమించింది కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో అర్హత సాధించాలంటే శ్రీలంక జట్టు( Sri Lanka ) ఈ మ్యాచ్లో గెలవాల్సి ఉంది.
కాబట్టి నేడు జరిగే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు క్లిష్టం గా మారతాయి.
అప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లకు సెమీస్ చేరే అవకాశాలు మరింత మెరుగు అవుతాయి.ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టుపై ఏకంగా 401 పరుగులు చేసిన కూడా న్యూజిలాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు.
ఇక ఆఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా ఆరంభం నుంచి ఒకలాగా మ్యాక్స్ వెల్( Glenn Maxwell ) క్రీజులోకి వచ్చాక మరోలా మారింది.కాబట్టి శ్రీలంక జట్టును తక్కువగా అంచనా వేయలేం.
మ్యాచ్ ను మలుపు తిప్పడానికి కేవలం ఒకే ఒక బంతి చాలు.ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి చివరి వరకు న్యూజిలాండ్ ఏ చిన్న పొరపాటును చేయకుండా అద్భుత ఆటను ప్రదర్శిస్తూ శ్రీలంక ఆటగాళ్ళను కట్టడి చేస్తేనే న్యూజిలాండ్ జట్టుకు సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది.







