టాలీవుడ్ లో మీరెవరినైనా అడిగి చూడండి … ఇప్పటి వరకు ఉన్న హీరోలలో ఎవరు నెంబర్ వన్ డాన్సర్ అని అడగ్గానే ప్రతి ఒక్కరు టక్కున చెప్పే పేర్లలో అల్లు అర్జున్( Allu Arjun ) పేరు ముందు వరుసలో ఉంటుంది.మరి ఆ రేంజ్ లో తన సినిమాల్లో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ఇరగదీస్తూ ఉంటాడు బన్నీ.
ఇక అల్లు అర్జున్ సినిమా వస్తుంది అంటే చాలు అందులో ఏదో ఒక పాటలో అయినా ఎంతో కష్టపడి వొళ్ళు హూనం చేసుకొని మరి ఎవరికి సాధ్యం కానీ డాన్స్ మూమెంట్స్ చేసి ఔరా అనిపిస్తాడు.మరి డాన్స్ విషయంలో అంతా పర్టికులర్ గా ఉండే బన్నీ ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తున్నాడా అంటే అవును అనే సమాధానం తప్పక వస్తుంది.
దువ్వాడ జగన్నాధం( Duvvada Jagannadham ) సినిమా నుంచి దాదాపు అల్లు అర్జున్ కంటెంట్ పై( Content ) మాత్రమే ఫోకస్ చేస్తూ వస్తున్నారు.అందువల్లే ఆయన సినిమాల్లో డాన్స్ పెర్ఫార్మెన్స్( Allu Arjun Dance ) స్కూప్ చాలా తగ్గిపోయింది.అలాగే సింపుల్ స్టెప్స్ తో కూడిన పాటలతో సినిమాలు చేస్తూ వెళ్తున్నారు.DJ సినిమా మాత్రమే కాదు అలా వైకుంఠపురం సినిమా లో సైతం అలా అలా లాగించేసారు.
ఆ తర్వాత వచ్చిన పుష్ప( Pushpa ) కూడా దాదాపు సింపుల్ స్టెప్స్ తోనే ఉంటుంది.ఇప్పటి వరకు ఇలా లాగించి ముందుకు వెళుతున్నారు కానీ ఇలాగే వెళ్లాలంటే మాత్రం కష్టం అనే విషయం బన్నీ కి అర్ధం అయిపోయినట్టుంది.
అందుకే ఈ లెక్కలన్నీ సరిచేయాలని నిర్ణయించుకున్నారట పుష్ప సీక్వెల్ తో.
పుష్ప 2 ( Pushpa 2 ) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎప్పుడు లేనంత భారీ ఎత్తున ఒక జాతర సెట్ వేసి అందులో 400 మంది జూనియర్ ఆర్టిస్టులతో 100 మంది డాన్సర్స్ తో ఒక పాట షూటింగ్ చేయబోతున్నారట.ఈ పాటకి బాలీవుడ్ నుంచి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ( Ganesh Acharya ) అందిస్తున్నట్టుగా సమాచారం.
ఈ పాటలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ పీక్ లో ఉంటుందని తెలుస్తోంది.దాంతో చాల రోజుల తర్వాత అల్లు అర్జున్ ఈ చిత్రం లో మళ్ళీ డాన్స్ తో కూడా మెరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.