తెలంగాణ సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది.కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో సీఎం హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది.
హెలికాప్టర్ పైకి ఎగరక పోవడంతో సీఎం కేసీఆర్ నేతలతో కలిసి బస్సులో రోడ్డు మార్గాన ఆసిఫాబాద్ సభకు బయలుదేరారు.కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ హాజరవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇటీవలే కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే.







