వీడియో: చైనీయులా మజాకా.. వేలాది డ్రోన్స్‌తో డ్రాగన్ ఫార్మేషన్..

చైనీస్ వ్యక్తులు( Chinese ) అద్భుతాలను సృష్టించడంలో ముందుంటారు.వారు చేసే కొన్ని పనులు ఎవరికి సాధ్యం కానట్లు అనిపిస్తాయి.

 1500 Drones Create A Chinese Dragon In The Night Sky Video Viral Details, Chines-TeluguStop.com

వారి ఆలోచనలు ఎప్పుడూ అడ్వాన్స్డ్ గా ఉంటాయి.అలాంటి అడ్వాన్స్డ్ థింకింగ్ తో తాజాగా వారు ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు.

రీసెంట్‌గా వారు సృష్టించిన ఆ అద్భుతానికి సంబంధించిన టైమ్-లాప్స్ వీడియో( Time-Lapse Video ) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చైనాలోని షెన్‌జెన్‌పై( Shenzhen ) ఆకాశంలో డ్రోన్లు ఎగురుతూ డ్రాగన్‌ను చాలా రియలిస్టిక్ గా క్రియేట్ చేయడం మనం చూడవచ్చు.

సిటీ యాన్యువల్ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రదర్శన చేశారు.వీడియోలో 1,500 డ్రోన్‌లు ఒక క్రమబద్ధంగా ఎగురుతూ రియల్ డ్రాగన్ లాంటి భ్రమను సృష్టిస్తున్నాయి.క్లిష్టమైన విన్యాసాలు ప్రదర్శిస్తూ మైమరిపిస్తున్నాయి.డ్రాగన్( Dragon ) శరీరం వందలాది వ్యక్తిగత డ్రోన్‌లతో( Drones ) రూపొందించడం జరిగింది, ఇవి ఖచ్చితమైన సింక్ లో కదలడానికి ప్రోగ్రామ్ చేయడం జరిగింది.

ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను మంత్రముగ్దులను చేస్తున్నాయి.

ప్రముఖ ట్విట్టర్ పేజీ సైన్స్ గర్ల్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 23 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఫైర్ వర్క్స్ తో( Fireworks ) కూడా ఇలాంటిది క్రియేట్ చేయొచ్చని కొందరు అన్నారు.అయితే ఫైర్ వర్క్స్ వల్ల గాలి కాలుష్యం పెరుగుతుందని, శబ్ద కాలుష్యం కూడా రెట్టింపు అవుతుందని మరికొందరు పేర్కొన్నారు.

డ్రోన్స్ వాడటం పర్యావరణానికి మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు.డ్రోన్ ప్రదర్శనలు ఈరోజుల్లో బాగా పాపులర్ అవుతున్నాయని, అవి అద్భుతంగా ఉండటమే అందుకు కారణమని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube