తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ ఫ్రం హోమ్ తో పాటు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది.ఎన్నికల్లో దివ్యాంగులు, వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన సంగతి తెలిసిందే.
విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు కూడా ఈ ఒక్కరోజే అవకాశం ఉంది.ఈ క్రమంలో అర్హులైన వారు ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ సాధించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.ఈ క్రమంలోనే రవాణాతో పాటు ప్రత్యే సౌకర్యాలను కల్పించనుంది.