టర్కీ పార్లమెంట్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.తన క్యాంపస్ రెస్టారెంట్లలో కోకా-కోలా, నెస్లే నుంచి కొన్ని ఉత్పత్తులను బహిష్కరించాలని నిర్ణయించింది, పార్లమెంటు నుంచి వచ్చిన ఒక ప్రకటన, కంపెనీల పేర్లను కన్ఫామ్ చేసిన ఒక సోర్స్ ప్రకారం ఈ సంగతి తెలిసింది.
ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే కంపెనీల ఉత్పత్తులను పార్లమెంటు విక్రయించబోదని ప్రకటన పేర్కొంది.అయితే నిర్దిష్ట బ్రాండ్‌ల పేర్లను స్టేట్‌మెంట్‌లో పేర్కొనలేదు.
అయితే, సోర్స్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, కోకా-కోలా డ్రింక్స్, నెస్లే ఇన్‌స్టంట్ కాఫీ మాత్రమే మెనూ నుంచి తొలగించబడిన ఉత్పత్తులు అని తెలిపింది.

హమాస్ మిలిటెంట్ గ్రూప్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు భావించే ఇజ్రాయెల్ ప్రొడక్ట్స్, పాశ్చాత్య బ్రాండ్స్‌ను బహిష్కరించాలని ప్రజల డిమాండ్ చేశారని, దానికి అనుగుణంగానే పార్లమెంటు స్పీకర్ నుమాన్ కుర్తుల్మస్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది.టర్కీలో ఇజ్రాయెల్, పాశ్చాత్య ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన సోషల్ మీడియా పోస్ట్‌ల మధ్య ఈ బహిష్కరణ జరిగింది, ముఖ్యంగా కోకాకోలా, నెస్లే, ఇజ్రాయెల్‌కు ఆర్థికంగా లేదా రాజకీయంగా మద్దతు ఇస్తోందని ఆరోపణలు వచ్చాయి.

గాజాపై ఇజ్రాయెల్ దాడులను, ఇటీవలి హింసలో జెరూసలేంకు పాశ్చాత్యుల మద్దతును టర్కీ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది.ఈ విషయంపై ఇప్పటి వరకు కోకాకోలా గానీ, నెస్లే గానీ స్పందించలేదని నివేదిక పేర్కొంది.భవిష్యత్తులో ఇంకెన్ని కంపెనీల ప్రోడక్ట్స్ బ్యాన్ చేస్తారో చూడాలి.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల చాలామంది చనిపోతున్నారు.రెండు మూడేళ్ల వయసున్న చిన్నపిల్లలు కూడా ఈ బాంబు దాడుల వల్ల గాయాల పాలు అవుతూ ఉన్నారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.







