తెలంగాణ( Telanagana ) రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్షన్స్ హడావిడి కనిపిస్తోంది.నాయకులు గల్లి గల్లి తిరుగుతూ వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు.
ఒకరు బజ్జీలు చేస్తుంటే, మరొకరు చిన్నపిల్లలకు స్నానం చేయిస్తున్నారు, ఇంకొకరు బట్టలుతుకుతున్నారు.ఇలా రకరకాలుగా ప్రచారం(prachram) చేస్తూ ప్రజలను వారి వారి పార్టీల వైపు తిప్పుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
అక్టోబర్ 9 ఎలక్షన్స్ కోడ్ పడ్డప్పటి నుంచి మొదలు అన్ని పార్టీల ఆఫీసులు కార్యకర్తలతో కళ కళ లాడిపోతున్నాయి.దీంతో నాయకులు కూడా సీట్ కన్ఫామ్ కాకముందు నుంచే ప్రజల్లో తిరుగుతూ ప్రతి రోజు వారి కేడర్ ను వారి వెంట తిప్పుకుంటున్నారు.
వారికి భోజనాలు, సకల సౌకర్యాలు కల్పిస్తూ ఎంతో ఖర్చు పెడుతున్నారు.అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఇక పోటీ చేసే వారు మాత్రం ఖర్చు గురించి అస్సలు ఆలోచించరు.

ఈ తంతు ఎప్పుడు ఎన్నికలు( Elections) జరిగినా ఉంటుంది.కానీ ఈసారి కాస్త డిఫరెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.చాలా పార్టీల్లో నాయకులంతా కింది స్థాయి వర్గాలకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని, ప్రతిరోజు నాయకుల వెంబడి తిరిగినా కానీ, కనీసం వారిని చూసుకోవడం లేదని గాబరపడుతున్నారట.ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసే నాయకుల్లో కొంతమంది నాయకులు( Leaders ) ఖర్చుకు వెనకాడుతున్నారని, ద్వితీయ శ్రేణి నాయకులను వెంట తిప్పుకుంటూ కనీస అవసరాలు కూడా తీర్చకుండా పిసినారి తనం చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే చాలామంది నాయకులు నామినేషన్లు వేస్తున్నా కానీ డబ్బులు అస్సలు తీయడం లేదట.దీంతో ద్వితీయ శ్రేణి నాయకులంతా అగ్రశ్రేణి నాయకులకు ఫిర్యాదులు( complaintss ) చేస్తూ అలక బూనుతున్నట్టు తెలుస్తోంది.మరి ఇది ఇలాగే కొనసాగితే ఎలక్షన్స్ సమయం వరకు ఈ కింది స్థాయి నాయకులు మనసు మార్చుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయని అంటున్నారు.ఇప్పటికైనా పోటీ చేసే నాయకులు తప్పనిసరిగా కిందిస్థాయి కార్యకర్తలను, నాయకుల కనీస అవసరాలు తీర్చుతూ ముందు కదలాలని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.







