తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అలంపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభలో పాల్గొన్నారు.
అలంపూర్ కాంగ్రెస్ అడ్డా అని రేవంత్ రెడ్డి తెలిపారు.జోగులాంబ ఆలయ అభివృద్ధిని కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు.
జోగులాంబ ఆలయానికి ఇస్తానన్న రూ.వంద కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.కరెంట్ పై కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు.కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్ వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు 24 గంటల కరెంట్ వస్తుందని నిరూపిస్తే తన నామినేషన్ వెనక్కి తీసుకుంటానని తెలిపారు.ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యత తనదని చెప్పారు.
దొరల తెలంగాణ కావాలా.ప్రజల తెలంగాణ కావాలా? అనేది తేల్చుకోవాలని సూచించారు.