భారీ ధరకు 'గేమ్ ఛేంజర్' ఆడియో రైట్స్ .. మెగా పవర్ స్టార్ రేంజ్ ఇది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్( Game Changer ) ఒకటి.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు.

 Popular Music Label Grabs The Audio Rights Of Ram Charan’s Game Changer, Game-TeluguStop.com

ఇక అప్డేట్ కోసం అయితే కళ్ళు కాయలు కాచేలా చూసిన విషయం తెలిసిందే.ఏది ఏమైనా మేకర్స్ పై మాత్రం ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు.

ఈ సినిమా కంటే వెనుక స్టార్ట్ అయిన సినిమాల నుండి కూడా అప్డేట్స్ వచ్చాయి.గేమ్ ఛేంజర్ నుండి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.

ఇక ఎట్టకేలకు ఈ సినిమా నుండి అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది.ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ నో అర్ధం అయ్యింది.

ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కోసం సిద్ధం అయ్యింది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది.ఈ సినిమా ఆడియో రైట్స్ ను సరిగమ లేబుల్ దక్కించుకున్నట్టు మేకర్స్ తెలిపారు.ఈ ప్రకటన పోస్టర్ కూడా కలర్ ఫుల్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది.

మొత్తానికి ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉన్నట్టు అర్ధం అవుతుంది.కాగా అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ ( Kiara Advani ) గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఫస్ట్ సింగిల్ దీపావళికి రాబోతున్న విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.ఆ సమయంలో అయినా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube