ఇసుక పాలసీ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఏపీఎండీసీ డైరెక్టర్ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.
కాగా ఈ ఇసుక పాలసీ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3 గా చింతమనేని ప్రభాకర్, ఏ4 గా దేవినేని ఉమ ఉన్నారు.ఈ క్రమంలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.







