సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలెబ్రెటీలకు గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ చానల్స్ ఇంస్టాగ్రామ్ రిల్స్ చేస్తూ ఎంతో మంది సెలెబ్రెటీ హోదా అనుభవిస్తున్నారు.
ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో టేస్టీ తేజ (Tasty Teja) ఒకరు.అయితే తేజ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించక ముందే ఈయన జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో కూడా సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి టేస్టీ తేజ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.ఇలా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను అందరితో పంచుకుంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తేజ తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్(Bigg Boss 7) కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే .ఈ కార్యక్రమంలో తొమ్మిది వారాలపాటు హౌస్ లో కొనసాగుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.తొమ్మిదవ వారంలో తేజ హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఇక ఈయన బయటకు రావడంతో పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అలాగే ఈయనను రిసీవ్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో వారందరిని చూసి కూడా తేజ ఎమోషనల్ అయ్యారు నేను ఈ స్థాయిలో ఆదరణ ఉంటుందని అసలు ఊహించలేదు అంటూ అందరికీ ఎమోషనల్ థాంక్స్ తెలియజేశారు.ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తేజ తన గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే అదిరే అభి(Adire Abhi) గురించి ప్రస్తావనకు వచ్చింది.అదిరే అభి గురించి తేజ మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

అదే అభి ఫోటో చూసినటువంటి తేజ మాట్లాడుతూ నా జీవితాన్ని మార్చేసిన దేవుడు అభి అన్నా అంటూ ఆయన తనకు ఇచ్చిన అవకాశం గురించి తెలియజేశారు.అన్నపూర్ణ స్టూడియోలో( Annapurna Studios ) జబర్దస్త్ కార్యక్రమం జరుగుతున్న సమయంలో నేను కొన్ని స్కిట్స్ చేశాను అయితే అక్కడ బయట వ్యక్తులని ఎక్కువగా ఉండనివ్వరనే సంగతి మనకు తెలిసిందే.నన్ను బయటకు పంపిస్తున్నటువంటి తరుణంలో అభి అన్న వచ్చి తనని బయటకు పంపించకండి నా మనిషి అంటూ నాకు జబర్దస్త్ లో అవకాశం కల్పించారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తాను టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను

ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది అదిరే అభి అన్న వల్ల మాత్రమే అంటూ ఈ సందర్భంగా అభి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.అయితే అభి ఇప్పటివరకు ఇలా ఎంతోమంది టాలెంట్ కలిగినటువంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఎప్పుడు కూడా తన గురించి గొప్పగా చెప్పుకోరు.ప్రస్తుతం బుల్లితెరపై వెండితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కమెడియన్ హైపర్ ఆదిని( Hyper Adi ) కూడా అభి తన స్కిట్ ద్వారా జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేశారు.
ఇప్పుడు ఈయన ఇండస్ట్రీలో సెలబ్రిటీగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే.







