తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) ఒకరు.కెరియర్ మొదట్లో సిరి రచయితగా పనిచేస్తున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు దర్శకుడుగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన పవన్ కళ్యాణ్ కు ( Pawan Kalyan ) మంచి ఆప్తమిత్రుడనే సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం స్నేహబంధం ఉందని చెప్పాలి.ఇకపోతే పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏదైనా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటే ముందుగా ఆ సినిమా కథ త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది.త్రివిక్రమ్ ఓకే చేస్తేనే పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాకు కమిట్ అవుతారు.అంతలా ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను నమ్ముతారు.ఇక పవన్ కళ్యాణ్ కి ఎన్నో సినిమాలకు ఈయన స్క్రీన్ ప్లే, రైటర్ గా కూడా పనిచేశారు.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా త్రివిక్రమ్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నవి.

పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన సినిమాల బాధ్యత మాత్రం త్రివిక్రమ్ తీసుకున్నారని చెప్పాలి.ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో తాజాగా వీరిద్దరి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నేడు పుట్టినరోజు ( Birthday ) జరుపుకుంటున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ ఊహించని అదిరిపోయే కానుక ఇచ్చారని తెలుస్తుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో ఆయన కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ లో సుమారు 6 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని త్రివిక్రమ్ కు కళ్యాణ్ కానుకగా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.