నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కలెక్టర్ కావడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరీష్ రాజ్ పుత్ మాత్రం ఈ లక్ష్యాన్ని సులువుగానే సాధించారు.
చదువుకు పేదరికం అడ్డు కాదని ఆయన ప్రూవ్ చేశారు.లక్ష్యం, కష్టపడే తత్వంతో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగవచ్చని నిరీష్ రాజ్ పుత్ చెప్పకనే చెప్పేశారు.
నిరీష్ రాజ్ పుత్ ఎంతోమంది సాధారణ యువకులకు ఆదర్శంగా నిలిచారు.
ఐఏఎస్ కావాలని ఎంతోమంది కలలు కంటారు.సివిల్స్ సర్వీసెస్ పరీక్షలు దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి కావడం గమనార్హం.ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నిరీష్ రాజ్ పుత్ ఎంతో కష్టపడి తన లక్ష్యాన్ని సాధించారు.
నిరీష్ రాజ్ పుత్ స్వస్థలం మధ్యప్రదేశ్( Madhya Pradesh ) లోని బింద్ జిల్లా కాగా యూపీఎస్సీ పరీక్ష కోసం సిద్ధమయ్యారు.నిరీష్ రాజ్ పుత్( Nirish Rajput ) ఆల్ ఇండియా స్థాయిలో 370వ ర్యాంక్ సాధించారు.
ఎన్నో కష్టనష్టాలను భరించి నిరీష్ రాజ్ పుత్ తన కలను నెరవేర్చుకోవడం గమనార్హం.నిరీష్ రాజ్ పుత్ తండ్రి వీరేంద్ర రాజ్ పుత్( Virendra Rajput ) కాగా వీరేంద్ర టైలర్ గా పని చేస్తూ ఫ్యామిలీని పోషించారు.నిరీష్ బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు.ఆ తర్వాత నిరీష్ ఇంటింటికీ పేపర్ వేసి ఆ డబ్బులతో పరీక్షల ఫీజులను కట్టారు.ప్రభుత్వ కళాశాలలో నిరీష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటినుంచి నిరీష్ యూపీఎస్సీ పరీక్షల ( UPSC Exams )కోసం ప్రిపేర్ అయ్యారు.
నాలుగో ప్రయత్నంలో 370వ ర్యాంక్ సాధించిన నిరీష్ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.సాధారణ, నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్లు సైతం కష్టపడితే సివిల్స్ లో ర్యాంక్ సాధించడం సులువేనని నిరీష్ పేర్కొన్నారు.