టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 22వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో ఈనెల 22 వరకు చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఏజీ కోర్టుకు తెలిపారు.దీంతో ఏజీ హామీని రికార్డ్ చేసిన న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారు.
అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.







