ఆ ఇద్దరికి గెలుపు సాధ్యమేనా ?

తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.అందరి దృష్టి అధికారంపైనే ఉండడంతో ఎవరి వ్యూహరచనల్లో వారు నిమగ్నమై ఉన్నారు.

 Is It Possible For Those Two To Win, Revanth Reddy, Bandi Sanjay , Cm Kcr , Pat-TeluguStop.com

ప్రస్తుతం అధికారం కోసం బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఎంతలా పరితపిస్తున్నాయో అందరికీ తెలిసిందే.అయితే ఈ రెండు పార్టీల నుంచి ఓ ఇద్దరు నేతల విషయంలో మాత్రం ఓటమి భయం వెంటాడుతోంది.

వారెవరంటే బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ).ఈ ఇద్దరు నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యారు.

Telugu Bandi Sanjay, Brs Bjp, Cm Kcr, Congress, Gangula, Patnamnarender, Revanth

అయితే ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారనుకోండి అది వేరే విషయం.అయితే ఈసారి ఇద్దరు నేతలు గెలుపు కోసం ఎలాంటి ప్రణాళికలతో ఉన్నారు.ప్రస్తుత పరిణామాల దృష్ట్యా వీరి గెలుపు ఖాయమేనా ? అనే విషయాలపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నారు.

తాజాగా నామినేషన్ వేశారు కూడా.ఆయనకు పోటీ గా బి‌ఆర్‌ఎస్ నుంచి గంగుల కమలాకర్( Gangula Kamalakar ) రేస్ లో ఉన్నారు.

గత ఎన్నికల్లో కూడా వీరిద్దరి మద్య హోరాహోరీ పోరు నదించింది.కానీ ఫైనల్ గా గంగుల కమలాకర్ చేతిలో 14 వేల ఓట్ల తేడాతో బండి సంజయ్( Bandi Sanjay ) ఓటమిపాలు అయ్యారు.

Telugu Bandi Sanjay, Brs Bjp, Cm Kcr, Congress, Gangula, Patnamnarender, Revanth

మరి ఈసారి ఆయన పై చేయి సాధించే అవకాశం ఉందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.నియోజిక వర్గంలో బండి సంజయ్ పై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.ఈ ఓటు బ్యాంక్ ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.ఇక రేవంత్ రెడ్డి విషయానికొస్తే గత ఎన్నికల్లో కోడంగల్ నుంచి పోటీ చేసిన ఆయన బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్ర రెడ్డి( Patnam Narender Reddy ) చేతిలో ఓటమిపాలు అయ్యారు.

ఈసారి కూడా ఈ ఇద్దరే తలపడనున్నారు.అయితే గతంతో పోల్చితే ఈసారి రేవంత్ రెడ్డి గ్రాఫ్ నియోజిక వర్గంలో పెరిగినట్లు కనిపిస్తోంది.అందువల్ల రేవంత్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువ అనేది కొందరి అభిప్రాయం.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube