ఆ ఇద్దరికి గెలుపు సాధ్యమేనా ?

తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.అందరి దృష్టి అధికారంపైనే ఉండడంతో ఎవరి వ్యూహరచనల్లో వారు నిమగ్నమై ఉన్నారు.

ప్రస్తుతం అధికారం కోసం బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఎంతలా పరితపిస్తున్నాయో అందరికీ తెలిసిందే.

అయితే ఈ రెండు పార్టీల నుంచి ఓ ఇద్దరు నేతల విషయంలో మాత్రం ఓటమి భయం వెంటాడుతోంది.

వారెవరంటే బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ).

ఈ ఇద్దరు నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యారు. """/" / అయితే ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారనుకోండి అది వేరే విషయం.

అయితే ఈసారి ఇద్దరు నేతలు గెలుపు కోసం ఎలాంటి ప్రణాళికలతో ఉన్నారు.ప్రస్తుత పరిణామాల దృష్ట్యా వీరి గెలుపు ఖాయమేనా ? అనే విషయాలపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నారు.తాజాగా నామినేషన్ వేశారు కూడా.

ఆయనకు పోటీ గా బి‌ఆర్‌ఎస్ నుంచి గంగుల కమలాకర్( Gangula Kamalakar ) రేస్ లో ఉన్నారు.

గత ఎన్నికల్లో కూడా వీరిద్దరి మద్య హోరాహోరీ పోరు నదించింది.కానీ ఫైనల్ గా గంగుల కమలాకర్ చేతిలో 14 వేల ఓట్ల తేడాతో బండి సంజయ్( Bandi Sanjay ) ఓటమిపాలు అయ్యారు.

"""/" / మరి ఈసారి ఆయన పై చేయి సాధించే అవకాశం ఉందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

నియోజిక వర్గంలో బండి సంజయ్ పై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

ఈ ఓటు బ్యాంక్ ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.ఇక రేవంత్ రెడ్డి విషయానికొస్తే గత ఎన్నికల్లో కోడంగల్ నుంచి పోటీ చేసిన ఆయన బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్ర రెడ్డి( Patnam Narender Reddy ) చేతిలో ఓటమిపాలు అయ్యారు.

ఈసారి కూడా ఈ ఇద్దరే తలపడనున్నారు.అయితే గతంతో పోల్చితే ఈసారి రేవంత్ రెడ్డి గ్రాఫ్ నియోజిక వర్గంలో పెరిగినట్లు కనిపిస్తోంది.

అందువల్ల రేవంత్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువ అనేది కొందరి అభిప్రాయం.మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఒక చిన్న ల‌వంగాన్ని ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా..?