పోషకాల నిధి బాదం అని దాదాపు చాలా మందికి తెలుసు.అందుకే బాదం</em( Almonds )ఆరోగ్యానికి ఎంతో మంచిది.
బాదం పప్పును ప్రతి రోజు చాలా మంది తింటూ ఉంటారు.బాదం లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
ప్రతి రోజు బాదంపప్పును తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.ఇది రక్తపోటు నుండి నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇంకా చెప్పాలంటే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా శరీరాన్ని చాలా రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది.పిల్లల మెదడు అభివృద్ధికి కూడా బాదం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
అయితే బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి బాదంపప్పు( Almonds ) రోజుకు ఎంత తినాలి? బాదం తినడానికి సరైన సమయం ఏది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వైద్య నిపుణుల ప్రకారం ప్రతి రోజు 30 నుంచి 50 గ్రాముల బాదంపప్పు తినాలి.అంటే ఎనిమిది నుంచి పది బాదం పప్పులు తింటే సరిపోతుంది.
నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు మూడు నుంచి నాలుగు బాదం పప్పులు తినిపించాలి.ముఖ్యంగా నానబెట్టిన బాదంపప్పును తింటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.50 గ్రాముల బదంపప్పులో దాదాపు 300 గ్రాముల కేలరీలు ఉంటాయి.ఇందులో 150 గ్రాముల కార్బోహైడ్రేట్స్( Carbohydrates ), 12 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు, ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటాయి.
మీరు ఎప్పుడైనా బాదం తినవచ్చు.కానీ దాని పూర్తి ప్రయోజనాలను పొందాలంటే ఉదయం ఖాళీ కడుపుతో బాదంపప్పును తినడం ఎంతో మంచిది.

బాదంపప్పులు ( Almonds )కొద్దిగా వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి.కాబట్టి రాత్రి అంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినడం మంచిది.బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సలేట్ పరిమాణం పెరుగుతుంది.ఇది మూత్రపిండాల్లో పేరుకుపోతుంది.దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.అంతే కాకుండా బాదంపప్పు ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి( Stomach ache ) అజీర్ణం వంటి పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి.
అంతే కాకుండా బాదం లో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి.ఎందుకంటే బాదంపప్పును ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కేలరీలు ఎక్కువగా పెరుగుతాయి.
కేలరీలు తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా పెరుగుతుంది.కాబట్టి బాదం పప్పును తగిన మోతాదులోనే తీసుకోవాలి.