తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయనున్న సీపీఎం మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఈ మేరకు హుజూర్ నగర్ అభ్యర్థిగా మల్లు లక్ష్మీ, నల్గొండ సీపీఎం అభ్యర్థిగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి బరిలో దిగనున్నట్లు వెల్లడించింది.
రేపు కోదాడ సీపీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు.ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామన్న తమ్మినేని మునుగోడు, ఇల్లందులో కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మునుగోడులో సీపీఐ పోటీ చేస్తే మద్ధతు ఇస్తామని చెప్పారు.అదేవిధంగా ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నామని వెల్లడించారు.