ఏపీలో ఆరోగ్య వ్యవస్థకు అనారోగ్యం వచ్చింది అంటూ లోకేష్ సంచలన పోస్ట్..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఏపీలో ఆరోగ్య వ్యవస్థ తీరుపై ట్విట్టర్ లో సీరియస్ పోస్ట్ పెట్టారు.“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యం లేదా సురక్ష అనే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనారోగ్యంతో ఉంది.నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన వర్గాలకు( Nallamala Tribals ) సేవలందిస్తున్న ఏపీ ప్రభుత్వ తీరు చాలా దయనీయంగా ఉంది” అంటూ చెట్ల కింద రోగులకు వైద్యం అందిస్తున్న ఫోటోలు విడుదల చేసి ట్వీట్ చేశారు.రాష్ట్రం బాగుపడాలని చివరిలో కోరుకున్నారు.

 Lokesh Sensational Post On Health System In Ap Details, Tdp, Nara Lokesh, Ap Gov-TeluguStop.com

అంతకుముందు పిచ్చోడి పాలన ఫలితం ప్రజారోగ్యం గాలిలో దీపమని సీరియస్ పోస్ట్ పెట్టారు.

నాలుగున్నర ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) అసమర్ధ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమయింది.రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి గారి సొంత జిల్లాలోనే పరిస్థితులు బాలేదని విమర్శించారు.నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన తండాల ప్రజలకు ఆ ప్రాంతంలో ధర్మాసుపత్రిలో మూడేళ్లుగా చెట్ల కింద వైద్య సేవలు అందిస్తున్నారంటే ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ దివాలా కోరు పాలన పుణ్యమా కర్నూల్ మరియు అనంతపురం వంటి బోధనసుపత్రుల్లోనూ దూది, గాజుగుడ్డ సైతం అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.ఏపీలో ఆరోగ్య వ్యవస్థ( AP Health System ) చాలా దారుణంగా ఉందని లోకేష్ ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube