ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో( Bigg Boss ) మొదటి నుండి చాలా స్ట్రాంగ్ గా అనిపించే కంటెస్టెంట్స్ లో ఒకడు శివాజీ.( Shivaji ) హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి కంటే శివాజీ వయస్సు లో చాలా పెద్ద, అయినప్పటికీ కూడా టాస్కులలో వాళ్ళతో సమానంగా పోటీ పడి ఆడేందుకు సిద్ధం అవుతాడు.
అందుకే శివాజీ దెబ్బలు తగిలి చెయ్యి కూడా బాగా దెబ్బ తిన్నింది.గత నాలుగు వారాల నుండి ఆయన ఫిజికల్ టాస్కులకు దూరంగానే ఉంటూ వచ్చాడు.
కేవలం సంచాలక్ ( Sanchalak ) గానే వ్యవహరిస్తూ వచ్చాడు.కానీ ఈ వారం ఆయన టాస్కులో పూర్తిగా పాల్గొన్నాడు.
చెయ్యి బాగాలేకపోయినా ఆయన ఆడిన తీరుకి సోషల్ మీడియా లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ వారం కూడా శివాజీ చెయ్యి బాగాలేకపోతే బిగ్ బాస్ టీం ఆయనని బయటకి పంపేయాలని నిర్ణయించుకుందట.

ఈ వీకెండ్ ఎపిసోడ్స్ తర్వాత బుధవారం రోజు శివాజీ బయటకి పంపే కార్యక్రమాలు మొత్తం జరుగుతున్నట్టు తెలుస్తుంది.అయితే కేవలం డాక్టర్ చెకప్( Doctor Checkup ) కోసమే శివాజీ ని హాస్పిటల్ కి పంపే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉందని, గతం లో కూడా ఇలాగే శివాజీ ని హాస్పిటల్ కి పంపి స్కానింగ్ చేయించి, చేతికి కట్టు కట్టి పంపారని, ఇప్పుడు మొన్న జరిగిన టాస్కులో బాగా ఆడడం వల్ల చెయ్యి నొప్పి పెరిగిందని, అందుకే అతనిని బయటకి పంపి మెరుగైన వైద్యం అందించే ఆలోచన లో బిగ్ బాస్ టీం( Bigg Boss Team ) ఉందని అంటున్నారు.ఒకవేళ శివాజీ కి ఇక చెయ్యి బాగా అయ్యే ఛాన్స్ ఇప్పట్లో లేకపోతే ఆయనని శాశ్వతంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపేస్తారని, పర్వాలేదు ఆడొచ్చు అనే విధంగా ఉంటే మళ్ళీ హౌస్ లోకి అడుగుపెడుతాడని అంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ గత సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన ఆది రెడ్డి( Aadi Reddy ) సోషల్ మీడియా లో ఒక పోస్టు పెడుతూ ‘శివాజీ గారు ఈ వీక్ ఎలిమినేట్( Eliminate ) అవ్వబోతున్నారు అనే దాంట్లో ఏమాత్రం నిజం లేదు.శుభ వార్త ఏమిటంటే ఆయన చెయ్యి ఇప్పుడు దాదాపుగా బాగా అయ్యిపోయింది అని తెలుస్తుంది.ఇక నుండి ఆయన మునుపటి లాగా ఫిజికల్ టాస్కులు కూడా ఆడొచ్చు’ అంటూ ఒక ట్వీట్ వేసాడు.
మరి వీటిలో ఏది నిజం, ఏది అబద్దం అనేది చూడాలి.ప్రస్తుతం ఉన్న వోటింగ్ ప్రకారం అయితే శోభా శెట్టి( Shoba Shetty ) లేదా టేస్టీ తేజలలో( Tasty Teja ) ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.







