తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో రాజమౌళి( Rajamouli )ఒకరు ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తీసుకొచ్చాయి.ఇక ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తున్న వరుస సినిమాలు పాన్ వరల్డ్ లెవెల్ లో దూసుకుపోతున్నాయి.ఇక ఇప్పటికే రాజమౌళి చేసిన ప్రతి సినిమా కూడా భారీ విజయాలను సాధిస్తు వచ్చాయి…
అయితే ప్రస్తుతం రాజమౌళి గురించిన ఒక చర్చ అనేది ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది ఏంటి అంటే రాజమౌళి కొడుకు అయిన కార్తికేయ( karthikeya ) ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇక మొన్నటి వరకు అతన్ని బిజినెస్ మాన్ గా చూడాలనుకున్న రాజమౌళి ప్రస్తుతం కార్తికేయ చేస్తున్న బిజినెస్ లో కొద్దిపాటి నష్టాలు రావడంతో ఇక బిజినెస్ లు వద్దు ఏం వద్దు సినిమాల్లో హీరోగా చేసి ఇండస్ట్రీ కి పరిచయం చేయిద్దాం అని రాజమౌళి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అందులో భాగంగానే కార్తికేయ నటన లో శిక్షణను కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ విషయాలను ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచినప్పటికీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాడనే మాట మాత్రం వాస్తవమనే చెప్పాలి.ఇక దానికి సంబంధించిన కథలను కూడా రాజమౌళి వింటు కొత్త డైరెక్టర్ తో కార్తికేయని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు.ఇక కార్తికేయ ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత రాజమౌళి స్వయంగా తన డైరెక్షన్ లోనే ఒక సినిమా చేసి కార్తికేయ కి ఒక మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదే క్రమంలో రాజమౌళి మహేష్ బాబు( Mahesh Babu ) తో చేసే పాన్ వర్డ్స్ సినిమా చేస్తూనే ఇటు కార్తికేయ సినిమా కి సంబంధించిన పనులను కూడా శరవేగంగా జరుపుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కనక మంచి విజయాన్ని సాధిస్తే కార్తికేయ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.