ఉత్తర భారతంపై నేపాల్ భూకంప తీవ్రత

నేపాల్ లో తీవ్ర కలకలం సృష్టించిన భూకంప తీవ్రత ఉత్తర భారతంపై పడింది.ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు బీహార్ లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

 Nepal Earthquake Intensity Over North India-TeluguStop.com

భూ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు రోడ్లపై పరుగులు పెట్టారు.భారీ భూకంపంతో నేపాల్ గజగజలాడింది.రాత్రి 11.30 గంటల సమయంలో భూమి కంపించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదు అయింది.నేపాల్ భూకంపలో సుమారు 128 మంది ప్రాణాలు కోల్పోయారు.వందలాది మంది గాయాలపాలయ్యారు.ఇళ్లు, భవనాలు నేలమట్టం కాగా కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.శిథిలాల కింద చాలా మృతదేహాలు చిక్కుకుని ఉన్నాయని తెలుస్తోంది.

ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.కాగా అధికారుల రెస్య్కూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube