ఈరోజుల్లో దొంగలు ఎక్కడపడితే అక్కడ ఉంటున్నారు.ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్స్( Public Transportation Vehicles ) లో ముసుగులో వచ్చి మరీ దొంగతనాలు చేస్తున్నారు.
అప్పుడప్పుడు అడ్డంగా దొరుకుతూ ప్యాసింజర్ల చేతిలో తన్నులు తింటున్నారు.తాజాగా పబ్లిక్ బస్సులో ఇద్దరు మహిళా జేబు దొంగలను ఓ మహిళ చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ ఆంటీ దొంగలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వారికి శిక్షగా చెప్పుల దెబ్బలు కొట్టింది.మహిళ( woman ) బస్సు నడక మార్గంలో నిలబడి సీట్లపై కూర్చున్న ఇద్దరు జేబు దొంగలను కొట్టడం వీడియోలో ఉంది.
వారిలో ఒకరు తిరిగి పోరాడటానికి ప్రయత్నిస్తుండగా, మరొకరు ఆమె ముఖాన్ని కవర్ చేసుకొని, దెబ్బలు తింటారు.కొంతమంది ప్రయాణికులు ఈ దృశ్యాన్ని చూస్తుండగా, మరికొందరు పట్టించుకోలేదు.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో ఇటీవలే పోస్ట్ చేయగా దీనికి ఇప్పటికే 14,000 లైక్స్ వచ్చాయి.చాలా మంది నెటిజన్లు మహిళ ధైర్యాన్ని ప్రశంసించారు, మరికొందరు దోపిడీకి గురైన వారి అనుభవాలను పంచుకున్నారు.కొందరు ఈ వీడియోను తమాషాగా భావించి జోకులు కూడా వేశారు.చాలామంది ఆంటీని పొగిడారు.ఇలా కొడితేనే రేపొద్దున విలువైన వస్తువులను దొంగలించరు.లేదంటే చాలామంది కన్నీటికి కారణం అవుతారు నెటిజన్లు అన్నారు.
మరి కొందరు మాత్రం మరి ఇంత విచక్షణ రహితంగా కొట్టడం ఏం బాగోలేదని పోలీసులకు అప్పగిస్తే వారే వీరి సంగతి చూస్తారు కదా అని పేర్కొంటున్నారు.కొంతమంది ఆడ దొంగలకే సపోర్టుగా మాట్లాడి షాకిచ్చారు.
ఈ వీడియో పెరుగుతున్న పిక్ పాకెటింగ్ సమస్య, మెరుగైన భద్రతా చర్యల ఆవశ్యకత గురించి చర్చకు దారితీసింది.