గులాబీ పూల సాగు( Rose Cultivation )ను పాలి హౌస్ లో చేస్తే చాలా చీడపీడల, తెగుళ్ల బెడద చాలా తక్కువ.అనవసర పిచికారి మందులు వాడాల్సిన అవసరం ఉండదు.
గులాబీ పూల సాగుపై అవగాహన ఉండే రైతులు పాలీహౌస్ ఏర్పాటు చేసి గులాబీ పూల సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.గులాబీ పంటను ఒకసారి వేస్తే దాదాపుగా మూడు సంవత్సరాల పాటు దిగుబడులను పొందవచ్చు.
గులాబీ పంట సాగుకు తేమశాతం తక్కువగా ఉండి రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాలు చాలా అనుకూలం.

మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు చేస్తేనే పెట్టుబడి వ్యయం తగ్గి దిగుబడి పెరుగుతుంది.గులాబీ సాగును రైతులు( Farmers ) వాణిజ్య సరళిలో చేపడుతున్నారు.అందుకే ఈమధ్య గులాబీ పంట సాగు చేసిన రైతులంతా మంచి లాభాలే పొందుతున్నారు.
గులాబీ పంటను పాలీహౌస్ లో సాగు చేస్తూ, కొమ్మ కత్తిరింపులు జరిపితే మొక్కకు కొమ్మలు అధికంగా ఉండి అధిక దిగుబడి ఇస్తాయి.ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో గులాబీ మొక్కల కొమ్మ కత్తిరింపులు చేయాలి.
మొగ్గలు వచ్చే దశలో తప్పకుండా ఎరువులు వేసి నీరు అందించాలి.మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగి నాణ్యమైన పూల దిగుబడిని ఇస్తాయి.
నాణ్యమైన పూల దిగుబడికి మార్కెట్లో చాలా మంచి డిమాండ్.ఒక గులాబీ మొక్క ధర రూ.5 దాకా పలుకుతుంది.ఈ లెక్కన ఒక ఎకరం పొలంలో ఏడాదికి 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందవచ్చు.

పంటను కష్టపడి పండించడం ఒక ఎత్తు అయితే మార్కెట్ చేసుకోవడం మరో ఎత్తు.ప్రణాళిక బద్ధంగా పండించి మార్కెట్ చేస్తేనే పూల సాగులో మంచి లాభాలు పొందవచ్చు.పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైనా చీడపీడలు ఆశించినట్లు కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. పాలి హౌస్ ( Polyhouse )లో సాగు చేసిన గులాబీ మొక్కల పూలు ఎక్కువ సమయం వరకు తాజాగా ఉంటాయి.
ఇక మార్కెట్లో తాజాగా ఉండే పూలకు డిమాండ్ ఏమిటో అందరికీ తెలిసిందే.