సినిమా ఇండస్ట్రీలో రకరకాల కేటగిరీల హీరోలు ఉంటారు.కొంతమంది 100 కోట్ల క్లబ్ లో ఉంటారు.
మరి కొంతమంది 50 కోట్ల మార్కెట్ ను కలిగి ఉంటారు.అది కాదంటే చిన్న సినిమా బడ్జెట్ తో కొంతమంది హీరోలు అప్పుడప్పుడు బంపర్ హిట్స్ అందుకుంటుంటారు.
ఈ మూడు కేటగిరీలను కాదని ఒక సపరేట్ కేటగిరి మన సినిమా ఇండస్ట్రీలో ఉంది.అందులో చాలామంది హీరోలు ఉన్నారు.
అప్పుడప్పుడు హిట్స్ కొడుతూ తాము ఉన్నాము అని నిరూపించుకుంటూ ఉంటారు.కానీ వారు ఏ కేటగిరీకి చెందకుపోవడం గమనించాల్సిన విషయం.
వారికి సపరేట్ మార్కెట్ కావాలని చాలా ఏళ్లుగా స్ట్రగుల్ అవుతూనే ఉంటూ కష్టపడతున్నారు.అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూ మార్కెట్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నారు.మరి ఆ ఎటు కాని క్యాటగిరి హీరోలు ఎవరు వారు చేస్తున్న సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శ్రీ విష్ణు

దాదాపు పుష్కర కాలంగా ఇతడు ఇండస్ట్రీలో ఉంటూ సరైన హిట్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.అప్పుడప్పుడు హిట్స్ కొట్టిన అంతకుమించి ఫ్లాప్స్ కూడా తన ఖాతాలో ఉంటున్నాయి.అందుకే అతని చిన్న హీరోగాను అలాగే పెద్ద హీరోను కాలేకపోతున్నాడు.
సామజవరగమన చిత్రం ( Samajavaragamana Movie ) విజయం సాధించడంతో ఇతన్ని కూడా మంచి హీరోగానే గుర్తిస్తున్నారు.మరి ఆ మార్కెట్ కాపాడుకోవడానికి శ్రీ విష్ణు( Sri Vishnu ) అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.
విశ్వక్ సేన్

పాగల్, ఫలక్ నామ దాస్, దాస్ కా దంకీ వంటి చిత్రాలతో 15 కోట్ల మార్కెట్ కలిగినటువంటి హీరో విశ్వక్సేన్.( Vishwak Sen ) కానీ ఇతడు మీడియం రేంజ్ హీరోగా మాత్రం అవలేకపోతున్నాడు.తన మార్కెట్ యాబై కోట్ల వరకు వెళ్లడానికి చాలా కష్టాలు పడుతున్నాడు.ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు ఈ హీరో.
ఆనంద్ దేవరకొండ

చాలా రోజులుగా సరైన హిట్టు కోసం ప్రయత్నిస్తున్న ఆనంద్ దేవరకొండకు( Anand Devarakonda ) బేబీ సినిమాతో బంపర్ హిట్ దక్కింది.దీంతో ఇతడికి కూడా ఒక మార్కెట్ ఏర్పడింది.అది నిలబెట్టుకోవడానికి డ్యూయెట్( Duet ) అనే ఒక బైలింగ్వల్ సినిమా తీస్తున్నాడు.
సంతోష్ శోభన్

ఇక సంతోష్ శోభన్( Santosh Sobhan ) కూడా దాదాపు ఈ లిస్టులోకే వస్తాడు.అతడు సినిమాలో ప్రామినెంట్ గా అయితే సినిమాలు తీస్తున్నాడు కానీ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడంలోనే కాస్త ఇబ్బందులు ఉన్నాయి.ప్రస్తుతం బేబీ మూవీ మేకర్స్ తో ఒక సినిమాని ఒప్పుకున్నాడు సంతోష్ శోభన్.
చూడాలి మరి ఏ రేంజ్ మార్కెట్ ని ఏ సినిమాతో క్రియేట్ చేసుకుంటాడో.







