కూతురు ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేసిన తండ్రి..!

కూతురు ప్రేమలో పడిన విషయం తండ్రికి తెలియడంతో ఆ ప్రేమించిన యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఆ తండ్రిని గురువారం కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

 The Father Brutally Murdered The Young Man Whom His Daughter Loved , Father ,-TeluguStop.com

పోలీసులు( Police ) తెలిపిన వివరాల ప్రకారం.ఫిరంగిపురం మండలం తాళ్లూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కూతురు గుంటూరు ( Guntur )వారి తోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ గా పని చేస్తోంది.

ఇదే హాస్పటల్లో పని చేస్తున్న పల్నాడు జిల్లా బెల్లంకొండ కు చెందిన సత్తెనపల్లి సీతారామాంజనేయులు ఆమెకు పరిచయం అయ్యాడు.కొంత కాలానికే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.

అయితే సీతారామాంజనేయులుకు ఇంతకుముందే బంధువుల అమ్మాయితో వివాహం కావడం, మనస్పర్ధల కారణంగా విడిగా ఉంటున్నాడు.

Telugu Guntur, Love, Murdered, Young-Latest News - Telugu

శ్రీనివాస్ రెడ్డికి తన కూతురి వ్యవహారం తెలిసింది.ఈ ప్రేమ విషయం నచ్చని శ్రీనివాస్ రెడ్డి తన కూతురిని పై చదువుల కోసం ఏడాది క్రితం అమెరికాకు పంపించాడు.రెండేళ్ల కోర్సు చదవాల్సి ఉండగా ఆమె కోర్సు పూర్తి చేయకుండానే గుంటూరుకు రావడానికి సిద్ధమైంది.

శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు వద్దు డిసెంబర్ లో రావాలని కూతురికి ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదు.దీనికంతటికి ఆమె ప్రేమ వ్యవహారమే కారణమని, తాను మౌనంగా ఉంటే కళ్ళముందే కూతురు జీవితం నాశనం అవుతుందని సీతారామాంజనేయులు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Telugu Guntur, Love, Murdered, Young-Latest News - Telugu

అక్టోబర్ 29వ తేదీ రాత్రి గుంటూరువారి తోటలోని సీతారామాంజనేయులు ఇంటికి వెళ్లి తన కుమార్తెను విదేశాల నుంచి ఇప్పుడే రావద్దని చెప్పమని కోరితే అందుకు వైద్యుడు సీతా రామాంజనేయులు నిరాకరించాడు.దీంతో శ్రీనివాస్ రెడ్డి( Srinivas Reddy ) తనతో పాటు తెచ్చుకున్న కారంపొడిని అతని కళ్ళల్లో చల్లి, ఓ ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టడంతో సీతారామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.హత్య అనంతరం శ్రీనివాసరెడ్డి తాను వేసుకున్న చొక్కా, ఇనుప సుత్తిని ఒక కవర్ లో చుట్టి, సిరిపురంలోని 30 అడుగుల లోతులో ఉన్న బావిలో పడేసి తాను జడ్చర్ల వెళ్ళాడు.హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటీవీ ఫుటేజీ, ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల సహాయంతో దర్యాప్తు ప్రారంభించగా శ్రీనివాస్ రెడ్డి నిందితుడని తేలింది.

శ్రీనివాస్ రెడ్డిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించగా గురువారం మధ్యాహ్నం పోలీసులకు చిక్కడంతో అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube