Niharika : అన్నయ్య పెళ్లిలో మాస్ డాన్స్ చేసిన నిహారిక… ఇలా చేసే విడాకులు తీసుకున్నావ్… ఆడుకుంటున్న నెటిజన్స్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) వివాహం ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈయన నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) తో రహస్యంగా ప్రేమ ప్రయాణం చేస్తూ తన ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడమే కాకుండా వారి అనుమతితో ఇటలీలో లావణ్య త్రిపాఠిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

 Niharika Mas Dance On Varun Tej Lavanya Trpathi Marriage-TeluguStop.com

మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకలలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని సందడి చేశారు.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇకపోతే తాజాగా ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యి .ఇందులో భాగంగా నిహారిక ( Niharika ) తన అన్నయ్య పెళ్లిలో మాస్ డాన్స్ చేస్తూ సందడి చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది.నిహారిక తన తండ్రితో పాటు మరికొంతమందితో కలిసి అద్భుతమైన డాన్స్ చేస్తూ సందడి చేశారు.

ఈ విధంగా నిహారిక వరుణ్ తేజ్ వివాహంలో డాన్స్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయగా ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో పై ఎంతో మంది వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ నిహారికను ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగా యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ.ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుని కొద్ది రోజులకే విడిపోవడానికి ఇంత ఖర్చు చేయడం అవసరమా అంటూ కొందరు కామెంట్లో చేస్తున్నారు .మరికొందరు మాత్రం నువ్వు కూడా నీ పెళ్లిలో ఇలాగే డాన్స్ చేసి విడాకులు తీసుకున్నావు నీ మాదిరే మీ అన్నయ్య కూడా విడాకులు తీసుకుని విడిపోవాలనుకుంటున్నావా అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు ఇలా శుభమా అని పెళ్లి బంధంతో ఒక్కటైనటువంటి ఈ జంట విడిపోవాలి అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

అయితే నిహారిక వివాహం కూడా ఎంతో ఘనంగా రాజస్థాన్ ఉదయపూర్ లో జరిగిన సంగతి మనకు తెలిసిందే.నిహారిక వివాహం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.అయితే ఈమె వివాహం కోసం నాగబాబు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

నిహారిక పెళ్లి వేడుకలలో కూడా ఇలా ఆటపాటలతో అందరూ సందడి చేశారు అయితే ఈమె మాత్రం పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలు కూడా పూర్తికాకుండానే తన భర్తకు విడాకులు ఇవ్వడంతో ఈమె పట్ల ఈ విధమైనటువంటి ట్రోల్స్ ఎదురవుతున్నాయి.పెళ్లి చేసుకొని కొద్ది రోజులకే విడిపోవడానికి ఇలా ఆర్భాటాలు అవసరమా అంటూ కూడా ఈ పెళ్లి ఫోటోలు వీడియోలపై నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే తన నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నిహారిక వృత్తిపరంగా బిజీ అవుతున్నారు.

ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నటువంటి నిహారిక నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube